కోన ఘోస్ట్ రైట‌ర్లు ఎంత‌మంది?

kona-venkatవాడుకొని వ‌దిలేస్తున్నారు… అనే స్టేట్‌మెంట్ ఇచ్చి సంచ‌ల‌నం సృష్టించాడు కోన వెంక‌ట్‌. ఇన్ని సినిమాల్లో రాసిన పంచ్‌ ల‌కంటే… ఈ పంచ్‌ కే జ‌నాలు విర‌గ‌బ‌డి న‌వ్వారు. అస‌లు చిత్రసీమ‌లో వాడుకొని వ‌దిలేయంది ఎవ‌ర‌ని?? ఈ మాట చెప్పిన కోన కూడా అంతేన‌ట‌. కోన కూడా ఎక్కువ‌గా ఘోస్ట్ రైట‌ర్ల పై ఆధార‌ప‌డ‌తార‌డి.. కోన సొంతంగా రాసిన డైలాగ్ ఒక్కటీ ఉండ‌ద‌ని… చిత్రసీమ‌లో గుస‌గుస‌లాడుకొంటున్నారు. కోన ద‌గ్గర దాదాపు ఎనిమిది మంది ర‌చ‌యిత‌లు ఘోస్టులుగా ప‌నిచేస్తార‌ట‌. అంద‌రికీ సీన్లు అప్పగించి… అందులో బాగున్న ముక్కల‌న్నీ క‌లిపి….మ‌రో సీన్ త‌యారు చేస్తాడ‌ట‌. మ‌రి ఆ ర‌చ‌యిత‌ల గురించి కోన ఎప్పుడైనా నోరు విప్పాడా? కోన చేస్తోంది కూడా వాడుకొని వ‌దిలేయ‌డ‌మే కదా? అయితే ఘోస్ట్‌ ల‌ను పెంచిపోషించ‌డంలో మాత్రం.. కోన దిట్టేన‌ట‌. త‌న ఆస్థాన ర‌చ‌యిత‌లంద‌రికీ బాగానే ముట్టజెబుతాడ‌ట‌. వారంతా బ‌య‌ట‌కు వ‌చ్చి నోరు విప్పితే కోన ప‌రిస్థితి ఏమిటో??