ఇక కెరియర్ విషయాన్ని పక్కన ఉంచితే వ్యక్తిగతంగా అన్నీ క్లారిటీగా చెప్పలేదు. కానీ ప్రస్తుతం ప్రేమలో ఉన్నాను అని క్లారిటీ ఇచ్చేసింది. ఫలానా వ్యక్తి అని చెప్పకుండా ఆ వ్యక్తి అందరు గర్వించదగిన వ్యక్తి అంటూ తన ప్రియుడి గురించి చెప్పకనే చెప్పింది. తాప్సీ నోట అతడి పేరు బయటకు రాలేదు కానీ తాప్సీ సన్నిహితులు మాత్రం ఒలంపిక్స్ రజత పతక విజేత డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆడగాడు మాతియాస్ బోయ్‌తో తాప్సీ గతకొంత కాలంగా ప్రేమలో ఉంది అని చెబుతున్నారు.
వ్యక్తిగత విషయాలను మీడియాతో చెబితే ఇక దృష్టి మొత్తం కూడా మా మీదనే ఉంటుంది అందుకే అన్నీ చెప్పలేను అని మీడియాతో కొంత దాచిన తాప్సీ ప్రియుడి గుట్టు మాత్రం బాలీవుడ్‌లో బట్టబయలు అయ్యింది.