మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాన్, రోషన్ మేక, శనయ కపూర్, జహ్రా ఖాన్‌లతో పాన్ ఇండియా వైడ్‌గా చేస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వృషభ’. ఈ ప్రాజెక్టులోకి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో భాగస్వామి అయ్యారు.
మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో హాలీవుడ్ సినిమాలు నిక్ తుర్లో నిర్మించాడు. సహ నిర్మాతగా వ్యవహరించాడు. వృషభ టీంలోకి నిక్ తుర్లో రావడంతో ఈ సినిమా హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కబోతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన 57 సెకన్ల వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని సెట్స్, ఎంత భారీగా తెరకెక్కించబోతోన్నారనే విషయాన్ని చూపించారు. హాలీవుడ్ స్టైల్‌ను ఫాలో అవుతూ తీస్తోన్న మొదటి సినిమాగా వృషభ రికార్డులకు ఎక్కింది.
హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో మాట్లాడుతూ.. ‘వృషభ అనేది నా మొదటి ఇండియన్ సినిమా. ఈ సినిమాలో నేను భాగస్వామిని అవ్వడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. హాలీవుడ్ కాకుండా ఇతర దేశాల్లో నేను పని చేస్తున్న మొదటి సినిమా ఇది. అలానే నేను ఫస్ట్ టైం ఓ బహు భాషా సినిమాకు పని చేస్తున్నాను. నేను ప్రతీ సినిమాను మొదటిదానిలానే ఫీల్ అవుతాను. ప్రతీ సినిమా నుంచి ఏదో ఒకటి కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉంటాను. వృషభ సైతం అలాంటి ఓ అందమైన ప్రయాణం అవుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
నిర్మాత విశాల్ గుర్నాని మాట్లాడుతూ.. ‘హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో వంటి వారు మా ప్రాజెక్టులోకి రావడం కలలా ఉంది. ఇలాంటి కల కనడానికి కూడా సాధ్యం కాదు. కానీ ఆయన ఈ సినిమాలోకి రావడంతో స్థాయి పెరిగింది. భారీతనం వచ్చింది. హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించబోతోన్న మొదటి ఇండియన్ సినిమాగా వృషభ రికార్డులకెక్కింది. మా వృషభ టీం మీద నమ్మకంతో ప్రాజెక్టులోకి వచ్చిన నిక్ తుర్లోకి ధన్యవాదాలు’ అని అన్నారు.
తండ్రీ కొడుకుల మధ్య వచ్చే హై ఆక్టేన్ ఎమోషనల్ డ్రామాగా వృషభ రాబోతోంది. మెగాస్టార్ మోహన్ లాల్, రోషన్ మేక, శనయ కపూర్, జహ్రా ఖాన్, శ్రీకాంత్ మేక, రాగిణి ద్వివేది వంటి వారు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్ భారీ ఎత్తున చూపించబోతోన్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ కాబోతోన్న అతి పెద్ద ప్రాజెక్టుల్లో వృషభ సైతం ఒకటి కానుంది.
కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ చేయబోతోన్నారు.
Get ready for a cinematic extravaganza like never before!
We are thrilled to announce that the incredibly talented executive producer #NickThurlow of Academy Award winning film "Moonlight", has joined our team for our upcoming film #VRUSHABHA pic.twitter.com/lmckfnqqxv
— VrushabhaMovie (@VrushabhaMovie) August 7, 2023