Site icon TeluguMirchi.com

హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్న వైట్ల

srinu-vytlaబాద్ షా చిత్రం విడుదలైన తరువాత మహేష్ తో ‘ఆగడు’ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న దర్శకుడు శీను వైట్ల ప్రస్తుతం అమెరికా లో హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ తెలుగు వారు తన పట్ల చూపుతున్న ఆదరణ పట్ల వైట్ల పులకించిపోతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో  చెబుతూ.. అంత దూరంలో ఉన్నప్పటికీ తనకి ఇంట్లో వున్నా అనుభూతే కలుగుతోందనీ, ఎన్నారై మిత్రులు ఇస్తున్న ఆతిధ్యం అద్భుతంగా ఉందనీ, సిన్సినాట్టి నుంచి డెట్రాయిట్ వెళ్ళడానికి మిత్రుడు ధర్మా తనకి చార్టెడ్ ఫ్లయిట్ ఏర్పాటు చేశారని వైట్ల ట్విట్ చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫోటోను ట్విట్టర్ తో పోస్ట్ చేశారు వైట్ల. ఈ ఫోటోలో వైట్ల కోసం ఏర్పాటు చేసిన చార్టెడ్ ఫ్లయిట్ చూడొచ్చు.

Exit mobile version