Site icon TeluguMirchi.com

Hi Nanna : ‘హాయ్ నాన్న’ నుండి గాజు బొమ్మ వచ్చేది ఆరోజే ?


నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘హాయ్ నాన్నా’. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘సమయమా.. ‘ పాట చార్ట్ బస్టర్ గా నిలవగా, తాజాగా ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ‘గాజు బొమ్మ’ అక్టోబర్ 6న విడుదల కానుంది.

నాని, కియారా ఖన్నా ముచ్చటగా మాట్లాడుకుంటున్న వీడియో ద్వారా ఇదే విషయాన్ని అనౌన్స్ చేశారు. ”లవ్ సాంగ్ రిలీజ్ చేశావ్.. మరి మన సాంగ్ ? అని బేబీ కియారా నానిని అడుగుతుంది. నాని పాపని గాజు బొమ్మ అని పిలుస్తాడు. తండ్రి కూతురు నేపధ్యంలోని ఈ పాట ‘హాయ్ నాన్నా’ సోల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ తో వస్తోన్న ఈ సినిమాలో నాని జోడిగా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 21న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

Exit mobile version