Site icon TeluguMirchi.com

శ్రుతిహాసన్‌ కి చాలా ప్లాన్స్ వున్నాయి


శ్రుతిహాసన్‌ స్టార్ హీరోయిన్. చాలా బడా సినిమాలు చేసింది. అయితే ఒక్కసారిగా సినిమాలు తగ్గిపోయాయి. ఒక్కసారిగా డల్ అయిపోయింది. ఇపుడు ఆమె చేతిలో సినిమాలు లేవు. కాటమరాయుడు తర్వాత మరో సినిమా చేయలేదు శ్రుతిహాసన్‌. ఇదే విషయాన్ని ఆమెకు అడిగితే విచిత్రమైన సమాధానం ఇచ్చింది.

నా జీవితంలో నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వెండితెరపై మిమ్మల్ని చాలా కాలంగా చూడలేకపోతున్నామే, సినిమాలను వదిలేశారా ? అని చాలా మంది అడుగుతున్నారు. సినిమాల్లోనే నటించాలా ? నాకు వేరే పనులు లేవా? నా జీవితం సినిమాలతో పాటు పలు విషయాలతో ముడిపడి ఉంది. శ్రుతి పెళ్లికి సిద్ధం అవుతున్నారు వంటి ప్రచారాన్ని చేయకండి. నాకు చాలా ప్లాన్స్ వున్నాయి” అని చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్‌.

Exit mobile version