Site icon TeluguMirchi.com

రష్మిక జోరు మామూలుగా లేదుగా…!  

 

 

టాలీవుడ్ వరుసబెట్టి ఆఫర్లతో మంచి జోరు మీద ఉంది హీరోయిన్ రష్మిక మందన్న. ఈ నటీమణి టాలీవుడ్ లో హీరోలతో పాటు సినిమాలను ఏలేస్తుందనే చెప్పాలి. మొదటి రెండు సినిమాలు మంచి హిట్ కావడంతో వరుసబెట్టి ఆఫర్లు కొట్టేస్తుంది. ఇప్పుడు ఆమె చేతిలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కూడా ఉంది. ఇంత స్టార్ స్టేటస్ దక్కడంతో తెలుగు పరిశ్రమతో పాటు సొంత పరిశ్రమ కన్నడలో కూడా ఆమె రెమ్యునరేష్ ఒక్కసారిగా భారీగా పెంచేసినట్లు టాక్ నడుస్తోంది.

అయితే రష్మిక మందన్న భారీ రెమ్యూనరేషన్ విషయాన్ని అక్కడి సినిమా వాళ్ళు కొందరు అభ్యంతరం తెలుతున్నట్లు తెలుస్తుంది. తాజాగా ఇదే విషయం మీద మాట్లాడిన రష్మిక ప్రతి ఒక్కరు తమ కెరీర్లో సమయానుకూలంగా వ్యవహరిస్తుంటారు. తాను కూడా అలాగే వ్యవహరిస్తాను.. అందులో ఎంతమాత్రం తగ్గేదే లేదు అనడమే కాకుండా…రెమ్యునరేష్ పించితే తప్పేంటి అని కూడ వ్యాఖ్యానించారు. మొత్తానికి రష్మిక హవా మామూలుగా లేదుగా అంటున్నారు సినీప్రేమికులు.

 

Exit mobile version