Site icon TeluguMirchi.com

యువ హీరోపై హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

hero heroineటాలీవుడ్‌లో హీరోగా ఇప్పుడిప్పుడే సక్సెస్‌ అవుతున్న యువ హీరో అల్లరి పనులు చేస్తున్నాడు అంటూ ఇటీవలే ఒక చిన్న చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయిన అమ్మడు అంటుంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ యువ హీరో షూటింగ్‌ గ్యాప్‌లో చేసే అల్లరి, అతడి కామెంట్స్‌, చెత్త జోకులు చిరాకు తెప్పిస్తున్నాయని, అతడు ఎప్పుడు చూసినా సెక్స్‌ గురించి మాట్లాడుతున్నాడని, ఆయన మాటల్లో నాపై కోరిక క్లీయర్‌గా తెలుస్తుంది అంటూ ఆ హీరోయిన్‌ తన సన్నిహితుల వద్ద చెబుతుందట. షూటింగ్‌ ప్రారంభం అయ్యి 15 రోజుల్లోనే అతడి నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ఆ కొత్త హీరోయిన్‌ చెప్పిందట.

కెరీర్‌లో పది సినిమాలు చేసి అందులో నాలుగు అయిదు సక్సెస్‌లు రావడంతో ఆ యువ హీరో అగడం లేదని, తనను వేదించడమే కాకుండా, దర్శకుడి పనిలో కూడా వేలు పెడుతున్నాడని, దర్శకుడికి కూడా ఆ హీరో అంటే ఆగ్రహంగా ఉన్నా కూడా తప్పడం లేదని ఆ హీరోయిన్‌ చెప్పుకొచ్చింది. సొంత ట్యాలెంట్‌తో తాను హీరోగా రాణించాను, ప్రస్తుత స్టార్‌ హీరోల కంటే తానే గ్రేట్‌ అన్నట్లుగా ఆ హీరో మాట్లాడుతున్నాడట.

ఆ హీరో ఎవరు, ఏంటో ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉంటుందనుకుంటా. అయితే హీరోయిన్‌ ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కొంతమంది పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రచారం చేసేందుకు వెనుకాడరు. ఈ హీరోయిన్‌ కూడా ఆ కోవకే చెందినదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Exit mobile version