టాలీవుడ్లో హీరోగా ఇప్పుడిప్పుడే సక్సెస్ అవుతున్న యువ హీరో అల్లరి పనులు చేస్తున్నాడు అంటూ ఇటీవలే ఒక చిన్న చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన అమ్మడు అంటుంది. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ యువ హీరో షూటింగ్ గ్యాప్‌లో చేసే అల్లరి, అతడి కామెంట్స్, చెత్త జోకులు చిరాకు తెప్పిస్తున్నాయని, అతడు ఎప్పుడు చూసినా సెక్స్ గురించి మాట్లాడుతున్నాడని, ఆయన మాటల్లో నాపై కోరిక క్లీయర్‌గా తెలుస్తుంది అంటూ ఆ హీరోయిన్ తన సన్నిహితుల వద్ద చెబుతుందట. షూటింగ్ ప్రారంభం అయ్యి 15 రోజుల్లోనే అతడి నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా ఆ కొత్త హీరోయిన్ చెప్పిందట.
కెరీర్లో పది సినిమాలు చేసి అందులో నాలుగు అయిదు సక్సెస్‌లు రావడంతో ఆ యువ హీరో అగడం లేదని, తనను వేదించడమే కాకుండా, దర్శకుడి పనిలో కూడా వేలు పెడుతున్నాడని, దర్శకుడికి కూడా ఆ హీరో అంటే ఆగ్రహంగా ఉన్నా కూడా తప్పడం లేదని ఆ హీరోయిన్ చెప్పుకొచ్చింది. సొంత ట్యాలెంట్‌తో తాను హీరోగా రాణించాను, ప్రస్తుత స్టార్ హీరోల కంటే తానే గ్రేట్ అన్నట్లుగా ఆ హీరో మాట్లాడుతున్నాడట.
ఆ హీరో ఎవరు, ఏంటో ఇప్పటికే మీకు అర్థం అయ్యి ఉంటుందనుకుంటా. అయితే హీరోయిన్ ఆరోపణల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది. కొంతమంది పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రచారం చేసేందుకు వెనుకాడరు. ఈ హీరోయిన్ కూడా ఆ కోవకే చెందినదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.