Site icon TeluguMirchi.com

విక్రమ్ సినిమాకు మరోసారి రెహమాన్ సంగీతం

 

వైవిధ్యభరితమైన నటుడు చియాన్ విక్రమ్ నటించిన ‘మిస్టర్ కె కె’ ఈ నెల 19న తెలుగు, తమిళ భాషలలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి రాజేష్ ఎం సెల్వ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా అక్షరా హాసన్, లీనా మెయిన్ రోల్ లో నటిస్తున్నారు.

అయితే విక్రమ్ 58వ సినిమాగా తెరకెక్కనున్న మూవీకి సంగీత దిగ్గజం ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ మూవీ యూనిట్ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది. డైరెక్టర్ మురుగదాస్ దాస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నారు. కాగా సెవెన్ స్క్రీన్ సుడియోస్, వియాకామ్ 18స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అలాగే.. గతంలో విక్రమ్ నటించిన విలన్, ఐ సినిమాలకు కూడా రెహమాన్ సంగీతం అందించిన విషయం తెలిసిందే.

Exit mobile version