తమిళ సినిమా పరిశ్రమలో ఎక్కువ శాతం మంది స్టార్స్ తమ సినిమాకు పని చేసిన యూనిట్ సభ్యులకు బహుమానాలు ఇచ్చే పద్దతిని ఫాలో అవుతూ ఉంటారు. ఇతర హీరోలకు ఎంతో మంది హీరోలు ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తూ ఉంటారు. హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్స్ కూడా ఇలాంటి బహుమానాలు ఇస్తూ ఉంటారు. తాజాగా విజయ్ కూడా తన ‘బిగిల్’ చిత్రం కోసం పని చేసిన ఏకంగా 400 మందికి బంగారు ఉంగరాలను బహుమానంగా ఇచ్చాడు. తన టీం మెంబర్స్‌తో పాటు, తన సినిమాకు పని చేసిన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు అందరికి కూడా ఈ రింగ్‌లు అందాయి.
బంగారు రింగులు తీసుకున్న ‘బిగిల్’ చిత్ర యూనిట్ సభ్యులు ఆనందంలో తేలిపోతున్నారు. తమతో ఇన్నాళ్లు పని చేయించుకుని వదిలేసేవారు ఎక్కువ మంది ఉంటారు. కాని విజయ్ మాత్రం తమ కష్టంను గుర్తించి తమకు బహుమానం ఇవ్వడం సంతోషంగా ఉందని వారు అంటున్నారు. విజయ్, అట్లీల కాంబినేషన్‌లో వచ్చిన గత చిత్రాల మాదిరిగానే బిగిల్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఫుట్‌బాల్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. అందుకే చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా తన ఆటోగ్రాఫ్ ఉన్న ఫుట్ బాల్స్‌ను కూడా విజయ్ కానుకగా ఇవ్వడం జరిగింది.