Site icon TeluguMirchi.com

సక్సెస్ సాధించినవాడే మాస్ హీరో

sudheer babu interviewహీరో కృష్ణ బంధువుగా సినిమారంగంలో అడుగుపెట్టినవాడు సుధీర్ బాబు. తొలిసినిమాగా ఎస్ఎమ్ఎస్ చేసాడు. డ్యాన్సులు, ఫైట్లలో కాస్త మంచి మార్కులే సంపాదించకున్నాడు. ఇప్పుడు రెండో సినిమాగా ప్రేమకథాచిత్రమ్ చేస్తున్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా సుధీర్ కొద్ది సేపు తెలుగుమిర్చితో మాట్లాడారు. ఆ ముచ్చట్లివి.

తెలుగు మిర్చి : రెండో సినిమా ఎందుకు ఆలస్యమైందంటే?

సుధీర్ : మొదటి సినిమాకు మంచి మార్కులే వచ్చాయి. కానీ ఆపై వచ్చిన కథలేవీ నాకు అంతగా సంతృప్తి ఇవ్వలేదు. నిజానికి అప్పట్లోనే ప్రేమకథాచిత్రమ్ కథ విన్నాను. ఓకె అన్నాను. కానీ యూనిట్ ఈ సినిమాపైకి రావడానికి కాస్త టైమ్ పట్టంది.

తెలుగు మిర్చి: ఎలాంటి కథలు కావాలంటే ?

సుధీర్: కేవలం ఫైట్లు పాటలు కాదు.. అవి నా బాడీ లాంగ్వేజ్ కు సూటవుతాయి కానీ, నటుడు, సినిమా సక్సెస్ కు కథ కీలకం. అలాంటి కథలో నా పాత్ర కాస్త చిన్నదైనా ఫరవాలేదు. కానీ మంచి నటుడు అనిపించుకోవడానికి సహాయం చేయాలి. అలాంటి కథలకోసమే నా అన్వేషణ

తెలుగు మిర్చి: మాస్ హీరో అంటే ఫైట్లు, పాటలు వుండొద్దా?

సుధీర్: జనం మెచ్చినవాడే మాస్ హీరో. మంచి సినిమాలో నటిస్తే, జనం తప్పకుండా ఓన్ చేసుకుంటారు. జనం ఓన్ చేసుకుంటే మాస్ హీ రోనే. పాటలు, ఫైట్లు చేస్తేనే కాదు.

తెలుగు మిర్చి:కుటుంబనేపథ్యం పనికొచ్చిందా?

సుధీర్: కృష్ణగారి కుటుంబంతో బంధుత్వం లేకున్నా సినిమాల్లోకి రావాలన్నదే నా తపన. చిన్నప్పటి నుంచీ. అదృష్ణం కొద్దీ బంధుత్వం తోడయింది. కానీ అది కేవలం ప్రేక్షకుల మందుకు వెళ్లాడానికి కేరాఫ్ అడ్రస్ లా ఉపయోగపడుతుంది కానీ , అదే చివరంటా నిలబెట్టదు. మనమేంటో ప్రూవ్ చేసుకోవాలి

తెలుగు మిర్చి: మారుతి డైరక్షన్ ఓకెనా?

సుధీర్: చాలా డిఫరెంట్ డైరక్టర్ . ఆన్ ది సెట్ ఎక్కువగా వర్కు చేస్తారు. డైలాగులు, సీన్లు అప్పటి కప్పుడు మార్చుకుంటారు.

తెలుగు మిర్చి: ఇకపై వరసగా సినిమాలు చేస్తారా ?

సుధీర్: ఇప్పటికే..వాడు మగాడ్రా బుజ్జీ..షూటింగ్ ప్రారంభమైంది. మాయదారి మల్లిగాడు వర్కింగ్ టైటిల్ తో మరో సినిమా ప్రారంభం కానుంది. ఇంకో సినిమా చర్చల్లో వుంది.

తెలుగు మిర్చి: దర్శకుల ఎంపిక ఎలా ఉంటుంది?

సుధీర్: ఫలనా దర్శకుల దగ్గర పనిచేస్తే బాగుండనే అనిపిస్తుంది. నాకయితే, ఎవర్నయినా, నాకు తగ్గ కథ వుంటే అవకాశం ఇవ్వండి అని అడగాడనికి మొహమాటం లేదు. ఎవరు అవకాశం ఇచ్చినా చేయడానికి రెడీ.

Exit mobile version