నా ఏడేళ్ల సినీ జీవితంలో అయిదేళ్లు ‘బాహుబలి’ కోసమే పని చేశాను అని వ్యాఖ్యానించాడు. కేవలం తెర మీద కనపడే వారు మాత్రమే కాకుండా తెర వెనుక కూడా ఎంతో మంది కష్టార్జితం ఉందని రానా చెప్పుకొచ్చాడు. ‘బాహుబలి’ ది బిగినింగ్ ఎంతో బాగా ఆదరించారు, ది కన్క్లూజన్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాం అని అశాభావం వ్యక్తం చేశాడు. మేము పరీక్షలు రాసి ఉన్నాం, ఫలితాలను ప్రేక్షకులు ఇవ్వాలి అంటూ రానా పేర్కోన్నాడు. ‘బాహుబలి’లో హీరోకు సమానమైన విలన్గా కనబబడం కోసం రానా ఎంత కష్ట పడ్డాడో చెప్పకనే చెప్పాడు. మొత్తానికి ‘బాహుబలి’కి పని చేసిన ప్రతి ఒక్కరిని కూడా అభినందించాల్సిందే. ఇంతవరకు ఉన్న సినీ రికార్డులు అన్నీ కూడా ‘బాహుబలి’తో ఊడ్చుకుపోవడం ఖాయం.