Site icon TeluguMirchi.com

జోరుతో దూసుకుపోతున్న భల్లాలదేవ

దగ్గుబాటి వారుసుడు రానా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత ‘బాహుబలి’ చిత్రంలో విలన్‌గా కూడా మెప్పించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ‘బాహుబలి’ తర్వాత ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మరోసారి సక్సెస్‌ అయ్యాడు. ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్ట్‌లతో చాలా బిజీ అయ్యాడు. రానా ఇప్పటికే ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’, ‘విరాటపర్వం’ చిత్రాల షూటింగ్‌లలో పాల్గొంటున్నాడు. వీటితో పాటు గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘హిరణ్యకశప’ చిత్రంలో నటించడానికి కూడా సన్నాహాలు జురుగుతున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

ఇన్ని సినిమాల్లో నటిస్తున్న రానా తాజాగా మరో చిత్రానికి కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ‘గృహం’ ఫేం మిలింద్‌ రావు తాజాగా ఓ ఆసక్తికర కథతో భల్లాల దగ్గరకు వెళ్లి ఒప్పించాడట. చేతబడుల నేపథ్యంలో చాలా ఆసక్తిగా ఆద్యంతం ఈ కథ సాగుతుందని, అందుకే వెంటనే రానా ఓకే చేసినట్టుగా సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు షురూ అయ్యాయి. ఇన్ని ప్రాజెక్ట్‌లను చేతిలో పట్టుకుని భల్లాలదేవ దూసుకుపోతున్నాడు.

Exit mobile version