Site icon TeluguMirchi.com

మరోసారి ఇస్మార్ట్‌ సందడి షురూ…

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి ముందు ఫ్లాపుల్లో ఉన్నాడు. దాంతో రామ్‌ సక్సెస్‌ సాధించడం కష్టమే అని అంతా భావించారు. కానీ పూరీ జగన్నాథ్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రంతో రామ్‌ మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంతో నష్టాల్లో ఉన్న పూరీ కూడా బయటపడ్డాడు. చాలామందికి బ’ఇస్మార్ట్‌ శంకర్‌’ సక్సెస్‌ ఉపయోగపడింది. ఇకపోతే ఈ చిత్రాన్ని ఎప్పుడంటే అప్పుడు చూసుకునే టైం వచ్చింది. వచ్చేనెల నుండి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ జీ 5లో సందడి చేయనుంది.

జీ 5 యాప్‌తో పాటు జీ టీవీలో కూడా ప్రసారం చేయనున్నారు. ఈ సందడి కోసమే ఇప్పటి వరకు యూట్యూబ్‌లో కూడా సీన్లను కానీ, పాటలను కారీ విడుదల చేయలేదు. జీ 5 యాప్‌ లో రావడానికి ముందే పబ్లిసిటీ చేయడానికి కాబోలు యూట్యూబ్‌లో కొన్ని సన్నివేశాలను అప్‌లోడ్‌ చేయనున్నారు. అనూహ్య స్పందన వచ్చిన ఈ చిత్రాన్ని జీ 5 భారీ రేటుకు కొనుగోలు చేసింది. ఇక అక్టోబర్‌ నుండి జీ టీవీ ద్వారా మరోసారి ఇస్మార్ట్‌ సందడి షురూ కానుంది.

Exit mobile version