వర్మ మొరిగే కుక్క అంటున్న హీరో తల్లి

ramgopal varmaవివాదాల దర్శకుడు అర్థరాత్రి తర్వాత వొడ్కాతో సరసమాడుతూ, వొడ్కా మత్తులో ఏవేవో మాట్లాడుతూ ఉంటాడు. ఇటీవలె వర్మ బాలీవుడ్‌ యువ హీరో టైగర్‌ ష్రాఫ్‌ను ట్రాన్స్‌ జెండర్‌ అన్నాడు. వొడ్కా మత్తులో వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దాంతో చిన్న విషయం కాస్త చాలా పెద్దదిగా మారింది. తాగిన మత్తులో వర్మ కూసిన కారు కూతలు సారీ చెప్పే దాకా వెళ్లాయి. అందుకే ఇకపై ఎవరిని బాద పెట్టను అని చాలా ధృడ నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇది ఎన్నిరోజులో చూడాలి. ఇకపోతే టైగర్‌ ష్రాఫ్‌ ట్రాన్స్‌ జెండర్‌ అని వర్మ చేసిన వ్యాఖ్యలకు గాను నెటిజన్లు వర్మపై ఆగ్రహం కనబరిచారు. ఒక వ్యక్తి గురించి ఏం తెలియకుండానే ఈ వ్యాఖ్యలు చేయడం తగునా అని వర్మపై దుమ్మెత్తిపోశారు.

ఒకవైపు నెటిజన్లు వర్మపై నిప్పులు చెరుగుతుండగా మరోవైపు టైగర్‌ ష్రాఫ్‌ తల్లి కూడా ఈ విషయంపై చాలా సీరియస్‌ అయ్యింది. అయినా కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, కార్వాన్‌ ముందుకు పోతూనే ఉంటుంది అని వర్మకు కుక్కతో పోల్చింది. తన కొడుకుపై వర్మ చేసిన వ్యాఖ్యలకు గాను హీరో తల్లి ఆయేషా ష్రాఫ్‌ మొరిగే కుక్కతో వర్మను పోల్చింది. ఈ విషయంపై టైగర్‌ ష్రాఫ్‌ కూడా స్పందించి నేను ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న, అతని కామెంట్లకు నేను స్పందించే స్థాయిలో లేను అంటూ వర్మపై పరోక్షంగా కోపాన్ని కనబర్చాడు.