రాజమౌళి తదుపరి చిత్రంలో హీరో ఫిక్స్‌!

టాలీవుడ్‌లో ఎన్నో సక్సెస్‌ చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. మిగతా చిత్రాల సంగతి పక్కకు పెడితే ‘బాహుబలి’ చిత్రంతో రాజమౌళి క్రేజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. కేవలం తెలుగు భాషలోనే కాకుండా విడుదలయిన అన్ని భాషల్లో కూడా ‘బాహుబలి’ చిత్రం గత రికార్డులన్నీ కూడా చెదరగొట్టింది. రాజమౌళి చెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో రాజమౌళి తదుపరి చిత్రంపై ఆసక్తి నెలకొంది. జక్కన్న చేయబోయే తర్వాతి చిత్రం ఎలా ఉండబోతుంది..?? ఏ భాషలో ఉంటుంది..?? హీరో ఎవరు అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల అభిమానులు రాజమౌళి తమ హీరోతో సినిమా చేస్తే బాగుండు అని భావిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రాజమౌళి తదుపరి చిత్రంలో హీరోగా నటించేది అల్లు అర్జున్‌ అని తెలుస్తోంది. ప్రస్తుతం ‘డీజే’ చిత్రంలో నటిస్తున్న బన్నీ తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బన్నీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. ఏది ఏమైనా రాజమౌళి చిత్రాలకు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ ఎదురు చూపులు తప్పవు అని చెప్పవచ్చు.