టుస్సాడ్స్‌లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం ఇదిగో

యంగ్‌రెబల్‌ స్టార్‌ ‘బాహుబలి’ చిత్రంలో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో నటుడిగా ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రభాస్‌ మైనపు బొమ్మను బ్యాంకాక్‌లోని మేడమ్‌ టుస్సాడ్స్‌లో ఆవిష్కరించబోతున్నాం అని టుస్సాడ్స్‌ వారు ప్రకటించారు. గత ఏడాది హైద్రాబాద్‌ వచ్చి ప్రభాస్‌ కొలతలు కూడా తీసుకున్నారు.

 

తాజాగా ప్రభాస్‌ మైనపు బొమ్మను తీర్చిదిద్దారు. ‘బాహుబలి’ చిత్రంలోని ఒక సీన్‌… ప్రభాస్‌ కాలకేయుడిని తన కిరిటానికి తగిలించి లాక్కుపోతున్న ప్రభాస్‌ విగ్రహాన్ని రూపొందించారు. అంతేకాకుండా ఆ పరిసర ప్రాంతంలో యుద్ద వాతావరణం ఉండేలా చక్కగా పరిసరాలను తీర్చి దిద్దారు. ఒక బాహుబలి వంద సినిమాలతో సమానం అనే టాగ్‌లైన్‌ ‘బాహుబలి’ విగ్రహం టుస్సాడ్స్‌లో ఏర్పాటు కానుంది. తెలుగు హీరో ప్రభాస్‌ మైనపు విగ్రహం టుస్సాడ్స్‌లో ఉండడం నిజంగా విశేషం. ఈ ఫొటోలను చూసి ప్రభాస్‌ అభిమానులు ఖుషీ ఫీలవుతున్నారు.