ప్రముఖ నటి హేమ ఎప్పుడు ఏదో వార్తతో తరుచుగా మీడియా ముందుకు వస్తూనే ఉంటుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన హేమ ఏదైనా క్లారిటీగా ఉంటేనే వార్తలు రాయండి అని మీడియాకు సుద్దులు చెబుతోంది. మీరు రాసే వార్తల వల్ల ఇతరుల జీవితలు నాశనం అవుతాయి అని హేమ ఆవేదన వ్యక్తం చేసింది. మీకు అధికారిక సమాచారం అంటే తప్పితే ఇష్టం ఉన్నట్టు రాయడం వల్ల ఇతరులు చాలా నష్టపోతున్నారు అని గుర్తుంచుకోవాలని మీడియాకు విన్నవించుకుంది. ఎవరైనా నటి ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చనట్టు రాస్తే అవతలి వారి జీవితం నాశనమవుతుంది అని హేమ చెప్పుకొచ్చింది.
ఇక ఎఫైర్లు, సెక్స్ రాకెట్ వంటి వాటిలో పక్కా సమాచారం లేనిదే నటి పేరు బయట పెట్టకండి, అలా మా ఎఫైర్ల గురించి రాసి డబ్బులు సంపాదించకండి ప్లీజ్ అంటూ మీడియాను వేడకుంది. ఒకవేళ మీరు అలా డబ్బు సంపాదిస్తే సంపాదిస్తారు కానీ ఆ డబ్బుతో మీ కుటుంబానికి సంతోషంగా తిండి పెట్టగలరా..? అని ప్రశ్నించింది.
ఇటీవల నటీమణుల మీద ఇలాంటి వార్తలు ఎక్కువవడంతో చాలామంది కెరియర్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ప్లీజ్… మా ఎఫైర్లతో రాతలు రాస్తూ డబ్బులు సంపాదించకండి అని మీడియాపై సంచలన వ్యాఖ్యు చేసింది. ఇటీవల ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు పుకార్లు విస్తృతం అవుతున్న నేపథ్యంలో నటి హేమ మీడియాపై ఇలాంటి షాకింగ్ కామెంట్లు చేసింది.