చైతూకే ఇలా ఎందుకు అవుతుంది??

chituనాకే ఇలా ఎందుకు అవుతుంది..?
– నాగ‌చైత‌న్య ఇలా ఎన్నిసార్లు బాధ ప‌డ్డాడో.?

కాదా మ‌రి? ఓ టాప్ హీరో త‌న‌యుడు. చేతిలో అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి నిర్మాణ సంస్థ ఉంది. ఏం మాయ చేసావె, 100 %ల‌వ్‌, త‌డాఖా లాంటి హిట్లున్నా చైతూ కెరీర్‌లో జోరు లేదు. అటోన‌గ‌ర్ సూర్య ఆగిపోయింది. 90 % షూటింగ్ పూర్తయినా సినిమా బ‌య‌ట‌కు రాలేదంటే అంత‌కంటే దుర‌దృష్టం ఏముంటుంది. నాగార్జున కూడా ఆ సినిమా విష‌యంలో ఏం చేయ‌లేక‌పోవడం మ‌రీ విడ్డూరం. మీడియా అదే ప్రశ్న వేస్తే… ”ఆ సినిమా గురించి మ‌ర్చిపోండి. ఇంకా మంచి మంచి సినిమాలు చేస్తాడు. చూడండి..” అంటూ స‌మాధానం దాటేస్తున్నాడు నాగ్‌. ఇప్పుడు హ‌లో బ్రద‌ర్ సినిమాకీ ఇదే ప‌రాభ‌వం.

హ‌లోబ్రద‌ర్ సినిమాని చైతూతో రీమేక్ చేయాల‌నుకొన్నారు. శ్రీ‌నివాస‌రెడ్డి వైఫ‌ల్యం వ‌ల్ల ఇదీ.. అటకెక్కింది. హీరోయిన్ల ఎంపిక జ‌రిగిపోయి, బ‌డ్జెట్ ఎలాట్మెంట్ కూడా అయిపోయి, అడ్వాన్సులు చేతికిచ్చేసిన త‌ర‌వాత ఈ సినిమా ఆగిపోవ‌డం అంద‌రినీ ఆశ్చర్యప‌రుస్తోంది. త‌న‌యుడి సినిమాలు ఆగిపోతుంటే నాగ్ కూడా ఏమీ చేయ‌లేక‌పోతున్నాడు. ఏ వార‌స‌త్వ హీరోకీ ఇలాంటి ప‌రాభ‌వం ఎదుర‌వ్వలేదు. ఎవ‌రికి వారే సొంత నిర్మాణ సంస్థల్లో సినిమాలు తీసుకొంటున్నారు. ఫ్లాప్ ఎదురైన‌ప్పుడల్లా హోం బ్యాన‌ర్ ఉంది క‌దా.. అనే ధైర్యం ఉంది అంద‌రికీ. కానీ.. చైతూకి మాత్రం ఆ న‌మ్మకం లేదు. పాపం… చైతూకే ఇలా ఎందుకు అవుతుందో..?