Site icon TeluguMirchi.com

‘హార్ట్ ఎటాక్’ సెన్సార్ రిపోర్ట్

Heart Attack Movie Censor Report
Heart Attack Movie Censor Report

దర్శకుడు పూరి జగన్నాధ్ నితిన్ కాంబినేషన్ లో వస్తున్నా తాజగా చిత్రం ‘హార్ట్ఎటాక్’. అదా శర్మ హీరోయిన్. చిత్రీకరణ పూర్తి చేసుకు రిలీజ్ కు సిద్దంగా వున్న చిత్రానికి ఈరోజు సెన్సార్ జరిగింది . సెన్సార్ బోర్డు చిత్రానికి ‘ఏ’ సర్టిఫికేట్ ఇచ్చింది.పూరి టోటల్ గా యూత్ ని టార్గెట్ చేసి చిత్రాన్ని తెరకెక్కించారని వినిపిస్తోంది. పూరి మార్క్ డైలాగ్స్, మేకింగ్, నితిన్ యాక్టింగ్ చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయని సమాచారం.

పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై రూపొందిన చిత్రానికి శాటిలైట్ రేటు బాగానే పలికింది. ఏకంగా రూ 4.5 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ సినిమాకి ద‌ర్శకుడు పూరి జ‌గ‌న్నాథ్ అయినా, నితిన్‌ కి ఉన్న లేటెస్ట్ హిట్స్ చూసే ఇంత శాటిలైట్ రేటు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. చిత్రాన్ని జనవరి 31నే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘ఇష్క్ , ‘గుండె జారి’ చిత్రాలతో వరుస హిట్స్ ను సొంతం చేసుకున్న నితిన్ కు హార్ట్ ఎటాక్ హ్యాట్రిక్ ను ఇస్తుందో లేదో చూడాలి.

Exit mobile version