Site icon TeluguMirchi.com

ఆయ‌న నాకు అన్న‌య్యండీ బాబూ..!

Thamanna

త‌మ‌న్నా బాలీవుడ్‌ లో చేసింది రెండు సినిమాలే. రెండోది ఇంకా విడుద‌ల కాలేదు. అయినా స‌రే… కావ‌ల్సినంత పాపులారిటీ సంపాదించేసింది. హిమ్మ‌త్‌ వాలాలో త‌మ‌న్నా న‌డుమొంపులు చూసి బాలీవుడ్ సైతం దాసోహ‌మంది. హ‌మ్‌ష‌క‌ల్స్ లో బినినీ వేసేది లేద‌ని ఖ‌రాఖండిగా చెప్పి మ‌రోసారి హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఆమెపై మ‌రో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. హ‌మ్ ష‌క‌ల్స్ ద‌ర్శ‌కుడు షాజిద్‌ ఖాన్‌ తో చ‌క్క‌ర్లు కొడుతోంద‌ట‌. వీరిద్ద‌రి మ‌ధ్య వ్య‌వ‌హారం ముదురుతోంద‌ని బాలీవుడ్ ప‌త్రిక‌లు కోడై కూస్తున్నాయి. వీటిపై క్లారిటీ ఇచ్చింది త‌మ‌న్నా. ”షాజిద్ ఖాన్ నాకు అన్న‌య్య‌లాంటివాడు. అత‌నితో లింకులు పెట్టి వార్త‌లు రాస్తుంటే నేనెలా స్పందించేది..?? పేరు, ప్ర‌తిష్ట‌లే కాదు.. సినిమా రంగానికి వ‌చ్చాక ఇలాంటి వార్త‌లు మోయ‌డానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఏం చేస్తాం..?? ” అంటూ త‌న నిర్వేదాన్ని వెలుబుచ్చింది. అన్న‌య్య అనేశాక ప‌త్రిక‌లు వాళ్లు మాత్రం ఏం రాస్తారు లెండి. ఈ గాసిప్పు ఇక్క‌డితో పుల్‌ స్టాప్ ప‌డ‌డం ఖాయం.

Exit mobile version