‘దాగుడు మూతలు’ తర్వాత ‘సీటీమార్‌


‘దువ్వాడ జగన్నాథమ్‌’తో మళ్ళీ ఫాంమ్ లోకి వచ్చిన హరీష్ శశంకర్ ఇప్పుడు రెండు సినిమాలతో సందడి చేయబోతున్నాడు ప్రస్తుతం హరీశ్‌ శంకర్‌ ‘దాగుడు మూతలు’ అనే సినిమాను తెరకెక్కిస్తు్న్నారు. ఈ సినిమాను నాని, శర్వానంద్‌తో మల్టీస్టారర్‌గా తెరకెక్కించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ సినిమా తరువాత ‘జవాన్‌’ నిర్మాత కృష్ణ నిర్మాణంలో ఓ సినిమా తీయబోతున్నాడు. ఈ సినిమా ఓకే టైటిల్ కూడా అనుకున్నారు. ‘దువ్వాడ జగన్నాథమ్‌’ సినిమాలోని ‘సీటీమార్’ పాటకు విశేష ఆదరణ లభించింది. బన్నీ డ్యాన్సులు కుర్రకారును ఉర్రూతలూగించింది. అయితే ‘సీటీమార్‌’ పదాన్నే హరీశ్‌ తన తదుపరి సినిమా టైటిల్‌గా పెట్టారని టాక్. ‘దాగుడు మూతలు’ తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.