దర్శకుడు హరీష్ శంకర్ ‘డీజే’ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన చిత్రం ‘వాల్మీకి’. ఈయన తమిళ హిట్ మూవీ ‘జిగర్తాండ’ను రీమేక్ చేస్తున్నాడు. గతంలో హిందీలో వచ్చిన దబాంగ్ చిత్రాన్ని గబ్బర్ సింగ్ అంటూ రీమేక్ చేసిన హరీష్ శంకర్ ఇప్పుడు జిగర్తాండ చిత్రాన్ని వాల్మీకి గా రీమేక్ చేశాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో దర్శకుడు హరీష్ శంకర్ ఉన్నాడు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ ‘వాల్మీకి’ చిత్రం తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేశాడు. ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంపై ఆయన పెట్టికున్నది నమ్మకమా? లేదా అతి నమ్మకమా అనేది చూడాలి. గతంలో ఈయన చేసిన సినిమాల ఫలితాలను బట్టి చూస్తుంటే ఈ చిత్రం అయితే సూపర్ హిట్ అవ్వడం లేదంటే డిజాస్టర్ అవ్వడం ఖాయం అంటున్నారు. మరి ఈ చిత్రం ఫలితం ఏంటీ అనేది మరో రెండు రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది.