Site icon TeluguMirchi.com

వాల్మీకి దర్శకుడి సామాజిక స్పృహ

దర్శకుడు హరీష్‌ శంకర్‌ వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘వాల్మీకి’ చిత్రాన్ని తెరకెక్కించారు. తమిళ చిత్రం ‘జిగర్తాండ’ రీమేక్‌గా ఈ చిత్ర తెరకెక్కింది. వరుణ్‌ తేజ్‌ సరసన పూజా హెగ్డే ఈ చిత్రంలో నటించింది. సెప్టెంబర్‌ 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం చిత్ర యూనిట్‌ ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ చిత్ర టైటిల్‌ విషయమే కాస్త వివాదాలకు తావిస్తోంది. ‘వాల్మీకి’ టైటిల్‌ గొడవ ఇంకా సాగుతూనే ఉంది. తాజాగా దర్శకుడు హరీష్‌ శంకర్‌ సామాజిక మాధ్యమం వేదికగా సామాజిక స్పృహ కనబర్చాడు.

హైద్రాబాద్‌లోని మాదాపూర్‌ సమీపంలో రోడ్‌ పై ప్రవహిస్తున్న డ్రైనేజీ ఫొటోలని సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ నగరంలో ప్రబలుతున్న జ్వరాల గురించి తెలుసు కదా, డ్రైనేజ్‌ లీక్‌ అయ్యి ఇలా రోడ్లను అసహ్యంగా మారుస్తున్నాయి, చర్చలు తీసుకోండి అంటూ జీహెచ్‌ఎమ్‌సీకి తెలియజేశాడు. గతంలో కూడా హరీష్‌ సామాజిక బాధ్యతని కనబర్చాడు. దాంతో నెటిజన్లు హరీష్‌ని తెగ మెచ్చుకుంటున్నారు.

Exit mobile version