హరి హర వీరమల్లు – కొల్లగొట్టినది సాంగ్ ప్రోమో వచ్చేసింది


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవెయిటెడ్ తెలుగు చారిత్రక యాక్షన్-అడ్వెంచర్ చిత్రం హరి హర వీరమల్లు. 17వ శతాబ్దంలోని మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో, ఈ సినిమా వీరమల్లు అనే డెకాయిట్ చుట్టూ తిరుగుతుంది. ఇప్పటికే పూర్తి అయిన పార్ట్‌ను క్రిష్ డైరెక్ట్ చేయగా, మిగిలిన పార్ట్‌ను నిర్మాత ఏ.ఎం. రత్నం కుమారుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విజేత ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. మార్చి 28, 2025 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న తరుణంలో ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్.

జనవరి 17 న విడుదలైన తొలి పాట “మాట వినాలి” కు అద్భుతమైన స్పందన లభించింది. రొమాంటిక్ సాంగ్ “కొల్లగొట్టినదిరో” ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానుంది. కాగా ఈ పాటకి సంబంధించిన ప్రోమో ఈ రోజు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.