‘హ్యాపీడేస్’ చిత్రం చాలా సింపుల్‌గా విడుదలయ్యి స్టూడెంట్‌ల పాత్రలను కళ్లకు కట్టినట్టు చూపడంతో ఈ చిత్రానికి యమ క్రేజ్ వచ్చింది. ఈ చిత్రంలో నటించిన వారు కూడా యూత్‌కు పిచ్చ పిచ్చగా నచ్చేశారు. ఈ చిత్రంలో నటించిన తమన్నా కూడా స్టార్ హీరోయిన్‌గా మారింది. కానీ చాలామంది మాత్రం కథల విషయంలో వెనుకబడి అలాగే ఉండిపోయారు. ఈ చిత్రంలో టైసన్‌గా నటించిన రాహుల్ అప్పట్లో అందరి నోళ్లలో నానిపోయాడు. టైసన్ పట్ల ప్రేక్షకులకు విపరీతమైన ఆదరణ కలిగింది. అంతలా ‘హ్యాపీడేస్’లో నటించి మెప్పించాడు కానీ ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. తాజాగా టైసన్ తన తప్పేంటో తెలుసుకున్నాడు.
ఏ పాత్రలో అయినా జీవించే రాహుల్ మంచి కథలను ఎంపిక చేసుకున్నా కూడా సక్సెస్‌ను అందుకోలేకపోయాడు. అందుకు కారణాన్ని తాజాగా తెలుసుకున్నాడట. తనకు ఉన్న ముఖ్య లోపం తన వాయిస్ అని, స్వరం సరిగా లేకనే ఆదరణ కరువయిందని అందుకే ‘వెంకటాపురం’ చిత్రానికి వేరే ఆర్టిస్ట్‌తో పవర్‌ఫుల్ వాయిస్‌ను డబ్బింగ్ చెప్పించాం అని అంటున్నాడు. తన వాయిస్ లోపం అని ఇన్నాళ్లకు తెలుసుకున్నాడు కానీ ఇదేదో ముందు తెలుసుకుంటే కాస్త లాభం ఉండేది. మొత్తానికి ఇప్పటికైనా ‘హ్యాపీడేస్’ కుర్రాడికి తన తప్పేంటో తెలిసిపోయింది.