Site icon TeluguMirchi.com

భాయ్‌…. బ‌ర్తడే బోయ్‌

nagఅత‌ను చైను ప‌డితే – అదో కొత్త ఒర‌వ‌డి.
అన్న ఫ్యాంటేస్తే – మాస్‌కి సంద‌డి!
ట‌క్కు టై క‌ట్టిన – గ్రీకువీరుడు
మ‌న మ‌ధ్య ఉన్న – మ‌న్మథుడు ఇంకెవ‌రూ..? వ‌న్ అండ్ ఓన్లీ నాగార్జున‌.

మాస్ ఇమేజ్ వ‌చ్చేస్తే అంద‌రికీ ఒక‌టే భ‌యం – ప్రయోగాలు చేస్తే ఎక్కడ బోల్తా ప‌డ‌తామో అని. ఆయ‌న ఆ భ‌యాన్ని ఎప్పుడూ ద‌రి చేర‌నివ్వలేదు. స్టార్ హీరో అయిపోతే ఓ లెక్క ఉంటుంది – అనుభ‌వ‌జ్ఞుల‌తోనే సినిమాలు చేయాల‌ని. ఆ నియ‌మాన్ని ఆయ‌న ఎప్పుడో ప‌క్కన పెట్టేశారు. క‌థ న‌చ్చిందా – అత‌నికి అనుభ‌వం లేక‌పోయినా పిల్చి అవ‌కాశాలిస్తారు. `అన్నపూర్ణ‌`లా మారి అవ‌కాశాలిస్తారు. ఆయ‌న చేతుల మీదుగా ద‌ర్శకులు, సంగీత ద‌ర్శకులు, క‌థార‌చ‌యిత‌లూ, క‌థానాయిక‌లూ ఇలా ఎంత‌మంది త‌యార‌య్యారో.. ఇప్పటికీ ఆయ‌న అదే పంథాలో వెళ్తున్నారు. త‌న‌కున్న యువ సామ్రాట్ బిరుదు త‌న‌యుడికి ఇచ్చేసి – కింగ్ అయ్యారు. అయితే అభిమానుల గుండెల్లో ఆయ‌న ఎప్పటికీ మ‌న్మథుడు, గ్రీకువీరుడే! ఇప్పుడు భాయ్‌గా స‌రికొత్త అవ‌తారం ఎత్తుతున్నారు. ఈ రోజు ఈ భాయ్‌.. బ‌ర్తడే బోయ్ అయ్యాడు! అదేనండీ ఆగ‌స్టు 29 నాగార్జున పుట్టిన రోజు. తెలుగు మిర్చి ఆయ‌న హృద‌యపూర్వకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ‌జేస్తోంది.

Exit mobile version