Site icon TeluguMirchi.com

Hanu Man : ‘హను మాన్’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ !


తేజ సజ్జ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన చిత్రం ‘హను మాన్’. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రీమియర్ షోస్ నుండే బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోంతుంది. విజువల్స్ తో ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేసి చూపించాడు. హనుమంతు అనే క్యారెక్టర్ లో తేజ సజ్జ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు.

ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ‘హనుమాన్’ డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత అంటే దాదాపు 60 రోజుల తర్వాత ఓటీటీలోకి రానుందట. కాగా ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో విలన్ గా వినయ్ రాయ్ కనిపిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్, గెటప్ శ్రీను, సత్య తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Hanu Man Review : హనుమాన్ రివ్యూ – పర్ఫెక్ట్ సూపర్ హీరో మూవీ

Exit mobile version