Site icon TeluguMirchi.com

Hanu Man : 300 కోట్ల క్లబ్ లో హను మాన్.. కొనసాగుతున్న రికార్డుల పరంపర !


తేజ సజ్జ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుండి వచ్చిన సూపర్ హీరో మూవీ ‘హను మాన్’. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం ‘ఆల్-టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్’ గా నిలిచింది. అంతేకాదు ఒకదాని తర్వాత ఒకటి రికార్డులు సృష్టిస్తూనే వుంది. తాజాగా ఈ చిత్రం ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే కేవలం 25 రోజుల్లోనే ఈ ఘనత సాధించింది.

“ఆల్-టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్ రికార్డ్స్ సృష్టిస్తూనే ఉంది. హనుమాన్ 25 రోజుల్లో 300Cr+ వరల్డ్ వైడ్ గ్రాస్ అందుకొని అన్ని సెంటర్లలో తన గ్లోరిఫైయింగ్ రన్ కొనసాగిస్తోంది” అని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఈ చిత్రంలో తేజ సరసన అమృత అయ్యర్ నటించగా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి హను-మాన్ చిత్రాన్ని నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాకి సీక్వెల్ గా రానున్న ‘ జై హనుమాన్’ పై కూడా భారీ అంచనాలే వున్నాయి. మరి ఈసారి ప్రశాంత్ వర్మ ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి మరి.

Exit mobile version