హన్సిక విలన్ వేషాలు

hansika
హన్సిక విలన్‌గా మారింది. రీల్ లైఫ్‌లో. కోలీవుడ్‌లో రెడీ అవుతోన్న ‘రోమియో జూలియట్’లో తొలిసారి విలన్ రోల్‌లో కనిపిస్తోంది హన్సిక. ఇందులో హన్సిక, జయం రవి నెగిటివ్ రోల్స్‌లో కనిపిస్తున్నారు. ఈ సినిమా ఫస్టాఫ్‌లో హన్సిక విలన్ కాగా, సెకండాఫ్‌లో జయంరవి ఈ తరహాగా కనిపిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఎప్పుడూ ప్రేమికురాలిగా కనిపించే ఈ బ్యూటీ, నెగిటివ్ షేడ్స్‌లో ఎలా వుంటుందనేనది ఆసక్తిగా మారింది. తన రోల్స్ పై హన్సిక మాట్లాడుతూ.. అన్నిరకాల రోల్స్ చేయాలన్నదే తన డ్రీమ్ అని చెప్పుకొచ్చింది. నెగిటివ్ షేడ్స్‌ లో వున్న హన్సిక ను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.