Site icon TeluguMirchi.com

రక్తంతో ఉత్తరం రాశాడు !

hansika
హస్కి బ్యూటీ హన్సిక కు ఓ అభిమాని రక్తంతో ఉత్తరం రాశేవాడట. దీంతో హన్సిక చలించిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా హన్సిక నే చెప్పింది. ‘మీ విషయంలోనూ ఇబ్బంది పెట్టిన అభిమానులున్నారా?’ అని హన్సికని అడిగితే.. ”ఎందుకు లేరూ..? తెరపైకొచ్చిన తొలి రోజుల్లోనే ప్రేమలేఖలందుకొన్నా. పేజీల కొద్దీ కవిత్వాలు రాసిన వాళ్లున్నారు. ఓ అభిమాని అయితే రక్తంతో ఉత్తరం రాసేవాడు. నా బొమ్మలు కూడా గీసేవాడు. నా ప్రతి పుట్టినరోజుకీ రక్తంతో రాసిన ఉత్తరం పంపేవాడు. అవి చూసి చలించిపోయేదాన్ని. ఇలాక్కూడా అభిమానిస్తారా? అనుకొనేదాన్ని. ‘ఒకసారి రా.. నిన్ను చూడాలి..’ అని సమాధానం రాశాను. కానీ అతనెప్పుడూ నాకు ఎదురుపడేలేదు. ఇలాంటి సంఘటనలకు ఎలా స్పందించాలో నాకు అర్థమయ్యేది కాదు. ఆ తరవాత మేం ఆ ఇల్లు మారిపోయాం. అప్పటి నుంచీ ఆ అభిమాని నుంచి ఉత్తరాలు రాలేదు..” అని చెప్పుకొచ్చింది హన్సిక.

Exit mobile version