విక్రమ్ కి ఓకే చెప్పింది !

vikram-and-hansikaతెలుగు, తమిళ భాషల్లో దూసుకుపోతోంది పాలబుగ్గల భామ హన్సిక. ఆమెకు చేతినిండా సినిమాలే. ఇప్పటికే తెలుగులో నాగ చైతన్యతో ‘దుర్గ’, రామ్ తో ‘పండగ చేస్కో’ చిత్రాలకు కమిట్ అయింది. తాజాగా, హన్సికకు బంపర్ ఆఫర్ వచ్చింది. విక్రమ్ తో నటించడానికి ఓకే చెప్పింది. ’ఐ’ చిత్రం తరవాత విక్రమ్ నటించబోయే సినిమాలో కథానాయికగా హన్సిక ఎంపికైంది. ధరణి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. విక్రమ్ తో సినిమాతో హన్సిక రేంజ్ అమాంత పెరగనుంది.