హీరోగా మారిపోయిన మ్యూజిక్ డైరెక్టర్

GVPrakash-Darlingసంగీత దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన ఏ.ఆర్. రెహ్మాన్ మేనల్లుడు జీ.వీ. ప్రకాష్.. ఇప్పుడు హీరోగా మారబోతున్నాడు. ఇప్పటివరకు జీవీ ఓ సింగర్‌గా, ప్రొడ్యూసర్‌గా మాత్రమే తెలుసు. కానీ త్వరలోనే ఆయన హీరోగా పరిచయం కాబోతున్నాడనే విషయం విని అందరు ఆశ్చర్య పోతున్నారు.

తెలుగులో సూపర్ హిట్టయిన ‘ప్రేమకథా చిత్రమ్’ తమిళ రీమేక్ ‘డార్లింగ్’ మూవీలో జీ.వీ. హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ముందే పెన్సిల్ అనే చిత్రంలో హీరోగా జీవీ నటించినప్పటికీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.