జి.వి.ప్రకాష్‌… హీరోయిజం

gv-prakash.jpjరెహ‌మాన్ మేన‌ల్లుడిగా ఎంట్రీ ఇచ్చి.. అన‌తి కాలంలోనే త‌న సొంత ముద్ర చూపించాడు జి.వి.ప్రకాష్. తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న‌కంటూ ఓ అభిమాన గ‌ణాన్ని సృష్టించుకొన్నాడు. ఉల్లాసంగా ఉత్సాహంగా, డార్లింగ్‌, ఎందుకంటే ప్రేమంట‌, ఒంగోలు గిత్త సినిమాల‌కు స్వరాలు అందించాడు. ఇప్పుడు మేక‌ప్ వేసుకొని కెమెరా ముందుకు రాబోతున్నారు. మురుగ‌దాస్ ద‌ర్శక‌త్వంలో ప్రకాష్ న‌టిస్తార‌ని కొంత‌కాలం క్రితం ప్రచారం జ‌రిగింది. అయితే త‌న తొలి సినిమా మాత్రం ఓ కొత్త ద‌ర్శకుడితో చేయ‌డానికి సిద్ధమ‌య్యాడు ఈ సంగీత ద‌ర్శకుడు. గౌత‌మ్ మీన‌న్ ద‌గ్గర స‌హాయ‌కుడిగా ప‌నిచేసిన నాగ‌రాజ్ ఈ చిత్రంతో ద‌ర్శకుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ప్రియా ఆనంద్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సైక‌లాజికల్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రానికి పెన్సిల్ అనే నామ‌క‌ర‌ణం చేశారు. త్వర‌లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుస్తాయి.