గుత్తా జ్వాల ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె గత కొంతకాలం గా ఓ యువ నటుడు విష్ణు తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి సన్నిహిత పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతూ వచ్చాయి .
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ నడుస్తుండడం తో ఎక్కడి ప్రజలు అక్కడే పరిమితం అయ్యారు. ఇదే గుత్తా ను తట్టుకోలేక చేస్తుందట. ప్రస్తుతం గుత్తా జ్వాలా హైదరాబాద్‌లోనూ, ఆమె ప్రియుడు విష్ణువిశాల్ చెన్నైలో ఉండిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రియుడిని విడిచి ఉండలేక తనదైన శైలిలో ట్వీట్ చేసింది.
‘నా బూను మిస్ అవుతున్నాను’ అంటూ గుత్తా జ్వాలా విరహ వేదన ఉట్టి పడేలా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన విష్ణువిశాల్ ….. దీనికి ఓకే, ఇప్పుడు సామాజిక దూరం పాటించడం ముఖ్యం’ అంటూ ఓ ఓదార్పు ట్వీట్ చేసాడు.