Site icon TeluguMirchi.com

ఆయన విడాకులకు గుత్తాజ్వాల కారణమా ?

భారత బ్యాడ్మింటన్‌ స్టార్ గుత్తాజ్వాల నటుడు విష్ణు విశాల్‌ పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే నటుడు విష్ణు విశాల్‌ కి ఇది వరకే పెళ్లి అయ్యింది. విడాకులు కూడా ఇచ్చాడు. అయితే దీనికి కారణం గుత్తాజ్వాల అనే విమర్శలు వచ్చాయి. దీనిపై విష్ణు స్పదించాడు.

‘నిజానిజాలు తెలుసుకోకుండా ఒకరి జీవితం గురించి కొందరు వ్యక్తులు అవాస్తవాలను ప్రచారం చేయడం చూస్తుంటే నాకెంతో బాధగా అనిపిస్తుంది. గుత్తాజ్వాల వల్లనే నేను నా భార్య నుంచి విడాకులు తీసుకున్నానని అన్నారు. నిజానికి విడాకులు తీసుకున్న తర్వాత నేను జ్వాల దగ్గర అయ్యామని, అంతకుముందు ఆమెకు పరిచయం కూడా లేదని’ చెప్పుకొచ్చాడు విష్ణు.

Exit mobile version