మంచు ఫ్యామిలీ హీరోలు విష్ణు మరియు మనోజ్‌లు వరుసగా చిత్రాలు చేసుకుంటూ దూసుకు పోతున్నారు. వీరిద్దరు సక్సెస్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాల సంఖ్య పెంచుకుంటూ పోతున్నారు. వీరిద్దరు కూడా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి దశాబద్ద కాలం దాటింది. అయినా ఇప్పటి వరకు వీరిద్దరిలో ఏ ఒక్కరికి కమర్షియల్‌గా బిగ్ సక్సెస్ దక్కింది లేదు. తాజాగా మంచు మనోజ్ ‘గుంటూరోడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది. అయితే ఈ సినిమా మంచు వారి పరువును దారుణంగా తీసింది.
‘గుంటూరోడు’ చిత్రాన్ని ఓవర్సీస్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. అందుకోసం ఒక డిస్ట్రిబ్యూటర్ రైట్స్‌ను తీసుకున్నాడు. సినిమా ప్రీమియర్ వేసేందుకు ప్లాన్ చేశాడు. అందుకోసం థియేటర్‌ను కూడా బుక్ చేశాడు. అయితే ఆశ్చర్యంగా ఒక్కటి అంటే ఒక్క టికెట్ కూడా అమ్ముడు పోలేదు. దాంతో షాక్ అయిన డిస్ట్రిబ్యూటర్ షోను క్యాన్సిల్ చేశాడు. ఇంతటి దారుణ పరిస్థితి గతంలో ఏ తెలుగు సినిమాకు ఓవర్సీస్లో ఎదురు కాలేదని అక్కడ వారు చెబుతున్నారు. నాని, అల్లరి నరేష్, శర్వానంద్ సినిమాలకు కూడా మంచి రెస్పాన్స్ ఉండే ఓవర్సీస్లో మంచు మనోజ్‌కు మాత్రం తీవ్ర నిరాశే ఎదురైంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి మరీ అంతగా కాకున్నా అలాగే ఉందని ఇక్కడి డిస్ట్రిబ్యూటర్లు గగ్గొలు పెడుతున్నారు.