బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గల్లీబాయ్’. అలియాభట్ కథానాయిక. జోయా అక్తర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో అలియాభట్ , రణ్వీర్ సింగ్ లుక్స్ చూపించారు.
ముంబయిలోని మురికివాడలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా ‘గల్లీబాయ్’ను తెరకెక్కిస్తున్నారు. ‘పద్మావత్’ కోసం అనేక కసరత్తులు చేసి బరువు పెరిగిన రణ్వీర్ ఈ సినిమా కోసం చాలా బరువు తగ్గారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.