ఈ సాంగ్ కూడా మొదటి సాంగ్ కు మించిపోయేలా ఉంది..సాంగ్ లొకేషన్ , హీరో హీరోయిన్ డ్రెస్ , డాన్స్ ఇలా ఒకటి అనే కాదు సాంగ్ అన్నిట్లోనూ అదరగొట్టింది. గుడిలో బడిలో అంటూ బన్నీ పూజా తో మంచి రొమాన్స్ చేసాడు. మరోసారి దేవి శ్రీ ప్రసాద్ బన్నీ కి అదరగొట్టే మ్యూజిక్ ఇచ్చాడు. దిల్ రాజు సినిమాకు భారీగా ఖర్చు చేసాడని సాంగ్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే జూన్ 23 వరకు ఆగాల్సిందే..ఈ లోపు మీరు గుడిలో బడిలో టీజర్ ఫై లుక్ వెయ్యండి.