డీజే – ‘గుడిలో బడిలో’ టీజర్ టాక్.

అల్లు అర్జున్ – పూజా హగ్దే జంటగా హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ‘దువ్వాడ జగన్నాథం’ ఫై మెగా అభిమానుల్లో అంచనాలు భారీ గా ఉన్నాయి. వారి అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా మూవీ తెరకెక్కిందని తాజాగా రిలీజ్ అవుతున్న సాంగ్ టీజర్స్ తో చెప్పవచ్చు..ఈ మధ్యనే విడుదలైన ‘శరణం భజే భజే’ సాంగ్ శ్రోతలకు ఎంతగానో నచ్చిన విషయం తెల్సిందే..తాజాగా చిత్రం లోని ‘గుడిలో బడిలో’ అనే రెండో సాంగ్ ను ఈరోజు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయడం జరిగింది.

ఈ సాంగ్ కూడా మొదటి సాంగ్ కు మించిపోయేలా ఉంది..సాంగ్ లొకేషన్ , హీరో హీరోయిన్ డ్రెస్ , డాన్స్ ఇలా ఒకటి అనే కాదు సాంగ్ అన్నిట్లోనూ అదరగొట్టింది. గుడిలో బడిలో అంటూ బన్నీ పూజా తో మంచి రొమాన్స్ చేసాడు. మరోసారి దేవి శ్రీ ప్రసాద్ బన్నీ కి అదరగొట్టే మ్యూజిక్ ఇచ్చాడు. దిల్ రాజు సినిమాకు భారీగా ఖర్చు చేసాడని సాంగ్స్ చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇక సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే జూన్ 23 వరకు ఆగాల్సిందే..ఈ లోపు మీరు గుడిలో బడిలో టీజర్ ఫై లుక్ వెయ్యండి.