‘గ్రీకువీరుడు’ క‌థేమిటి?

greeku-veeruduగ్రీకువీరుడు వచ్చేయ‌డానికి రంగం సిద్ధమైంది. మ‌రో రెండు రోజుల్లో ఈ వీరుడి జాత‌కం తేలిపోనుంది. ఈలోగా గ్రీకువీరుడు క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమాలో సంతోషం, మ‌న్మథుడు ల‌క్షణాలుంటాయి… అని ప‌రిశ్రమ‌లో చెప్పుకొంటున్నారు. వాస్తవానికి పునాది అదే అయినా డిఫ‌రెంట్ ట్రీట్‌ మెంట్ ఇచ్చే ప్రయ‌త్నం చేశాడు ద‌శ‌ర‌థ్‌. టూకీగా ఈ సినిమా క‌థేమిటంటే…

చందు (నాగార్జున‌) అమెరికాలో ఈవెంట్ మేనేన్‌ మెంట్ కంపెనీని నిర్వహిస్తుంటాడు. ప్రేమ‌పై పెద్దగా న‌మ్మకాల్లేవు. ప్రేమ శాశ్వతం అనే మాట ఒప్పుకోడు. బంధాల‌ను ఈజీగా తెంచేసుకొంటాడు. అత‌ను తొలిసారి ఇండియా వ‌స్తాడు. ఇక్కడ సంధ్య (న‌య‌న‌తార‌) పరిచ‌యం అవుతుంది. ఆమె ‘ఎ మేక్ ఏ విష్’ అనే స్వచ్ఛంత సంస్థలో వైద్యురాలిగా ప‌నిచేస్తుంటుంది. ఆమెకు ప్రేమ‌పై, బంధాల‌పై న‌మ్మకం ఎక్కువ‌. జీవితంలో శాశ్వత‌మైన‌ది ప్రేమే అని న‌మ్ముతుంది. వీరిద్దరి మ‌ధ్య న‌డిచే క‌థే… ఈ గ్రీకువీరుడు. ఇందులో బ్రహ్మానందం కూడా ఓ డాక్టర్‌ గానే క‌నిపిస్తారు. బంధాల‌ను తెంచుకోకూడ‌దు.. వాటిపై న‌మ్మకం పెంచుకోవాలి అనే క‌థాంశంతో తీసిన సినిమా ఇది. మీరాచోప్రా పాత్ర కాస్త బ‌బ్లీగా తీర్చిదిద్దార‌ని స‌మాచారం.