గ్రీకువీరుడు మనసు మారింది

Greeku-Veeruduగ్రీకు వీరుడు నాగ్ మనసు మార్చుకున్నాడు. గ్రీకువీరుడుగా 26నే వస్తున్నాడు. మొదట వెంకీ షాడో, నాగ్ గ్రీకు వీరుడు 26న విడుదలకు సిద్దమయ్యాయి. బావ బామ్మర్దుల పోటి.. అని మీడియాలో కధనాలు కూడా వచ్చాయి. కాని ఏం జరిగిందో తెలిదు.. గ్రీకువీరుడ్ని సడన్ గా మే మొదటి వారానికి వాయిదా వేసుకున్నాడు నాగ్. ఇంతలోనే మళ్లీ మొదటికొచ్చాడు. గ్రీకువీరుడు 26నే ప్రకటించేశాడు. మే మొదటి వారనికైతే బన్ని ‘ఇద్దరమ్మాయిలతో’ సిద్దంగా వుంటాడు. ఇది కూడా భారీ సినిమానే. పూరి, బన్ని ఫామ్ లో కొస్తే ఆ రిజల్ట్ ఎలాగుంటుందో నాగ్ బాగా తెలుసు. అందుకే గ్రీకు వీరుడు 26కు ఫిక్స్ చేశాడని టాక్ వినిపిస్తుంది. షో… చుడలేమనుకున్న బావ బామ్మర్దుల హంగామా 26కి రెడీ గా ఉందన్నమాట.