మహేష్ బాబు కు తల్లి దొరికిందా..?

gracy-singhకొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. చాల రోజుల నుండి ఈ చిత్రం లో మహేష్ బాబు కు తల్లి పాత్రలో నటించబోయే హీరొయిన్ కోసం చాల పేర్లు వినపడుతూ వచ్చాయి..మొదట్లో నదియ పేరు వినపడింది..ఆ తరవాత అతిలోక సుందరి శ్రీదేవి నటిస్తుందని ప్రచారం జరిగింది. తాజాగా మరో పేరు మీడియా లో వినపడుతుంది.

‘సంతోషం’ చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన గ్రేసి సింగ్ పేరు ఆ లిస్ట్ లోకి వచ్చింది . ఈ హీరొయిన్ అయిన తీసుకుంటున్నారా ? లేదా ? అని అబిమానులు సందేహం లో పడ్డారు. ఇక ఈ చిత్రం లో మహేష్ బాబు కు జోడిగా శ్రుతి హాసన్ నటిస్తుంది. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ‘శ్రీమంతుడు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రి మూవీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతుంది. యలమంచిలి రవి శంకర్, మోహన్, ఎర్నేని నవీన్ నిర్మాతలు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఈ వేసవిలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.