Site icon TeluguMirchi.com

గోవిందుడి టీజర్ టాక్ !

chran
ద‌స‌రా బ‌రిలోకి దిగ‌డానికి రామ్‌చ‌ర‌ణ్ స‌న్నద్దం అవుతున్నాడు. కృష్ణవంశీ సినిమా గోవిందుడు అంద‌రివాడేలే ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. చరణ్ కు కాజ‌ల్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి బండ్లగ‌ణేష్ నిర్మాత‌. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ టీజర్ ను రిలీజ్ చేశారు. పల్లెటూరు, పచ్చని పొలాలు, అందమైన కుటుంబం, కలర్ పుల్ లోకేషన్లుతో టీజర్ ను కట్ చేశారు. చరణ్ కొత్త లుక్కు తో కనిపించాడు. అడుగడుగునా కృష్ణ వంశి మార్క్ కనిపించింది. మొత్తానికి టీజర్ తో గోవిందు అదుర్స్ అనిపించాడు. చిత్రాన్ని అక్టోబర్ 1న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Exit mobile version