గోవిందుడు కు కరెంట్ లేదు…

gavగోవిందుడు కు కరెంట్ లేదు ఏంటి అని ఆశర్యపోతున్నారా ?..మేము చెప్పేది మంచు మనోజ్ నటిస్తున్న కరెంట్ తీగ
సినిమా గురించి..కొన్ని రోజుల నుండి ఈ చిత్రం అక్టోబర్ 2 న విడుదల చేస్తున్నాం అని ప్రకటన చేసారు చిత్ర యూనిట్ కానీ ఇప్పుడు ఈ చిత్ర రిలీజ్ విషయం లో కాస్త వెనుకడుగు వేసారట..దీనికి కారణం రామ్ చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కృష్ణ వంశీ దర్శకత్వం లో రాబోతున్న ఈ చిత్రం ఫై అబిమనులలో అంచనాలు బాగా ఉండడం తో ఈ సినిమా పోటిగా మనోజ్ కరెంట్ తీగ రిలీజ్ చేయడం మంచిది కాదని చిత్ర నిర్మాత మంచు విష్ణు ఆలోచింది సినిమా ని ఓ వారం రోజుల తరవాత రిలీజ్ చేయడానికి సిద్దం అయ్యాడని వార్త.