సావిత్రి ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు తన తండ్రి ఆమె దగ్గరే ఉన్నాడని, ఆమె ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నాం అని విజయ చాముండేశ్వరి వ్యాఖ్యానించారు. అమ్మ చివరి దశలో ఆర్థిక ఇబ్బందులను అనుభవించింది అనే వార్తల్లో నిజం లేదని, అసలు అలాంటి పరిస్థితి తమకు ఎప్పుడు కలగలేదని, ఈనాడు తాము ఈ స్థితిలో ఉండడానికి కారణం అంతా అమ్మ చలువేనని సావిత్రి కూతురు చెప్పుకొచ్చింది. మహానటిపై పలు పుకార్లనను కొట్టి పారేసి సావిత్రికి చివరి దశలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు అని కూతురు విజయ చాముండేశ్వరి క్లారిటీ ఇచ్చింది.