ఏప్రిల్ 14న ‘దరువెయ్యరా..’


మ్యాచో హీరో గోపీచంద్, డింపుల్ హయతి జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామబాణం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెకండ్ సింగిల్ ‘దరువెయ్యరా..’ సాంగ్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 14న కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

ఇక ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. జగపతి బాబు, కుష్బూ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీని మే 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. కాగా హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలిసి రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఇప్పుడు వారి మూడో చిత్రం ‘రామబాణం’తో హ్యాట్రిక్ పూర్తి చేస్తారో లేదో చూడాలి మరి.