Gopichand : ‘సాహసం’ కాంబో రిపీట్.. గోపీచంద్ కొత్త సినిమా షురూ


Gopichand : ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ మార్గదర్శకత్వంలో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా, మాచో స్టార్ గోపీచంద్‌తో కలిసి మరో భారీ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. గతంలో ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘సాహసం’ మంచి హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో మళ్లీ ఓ పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. కుమార్ సాయి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, ‘సాహసం’ సినిమాటోగ్రాఫర్ శామ్ దత్ ISC ఈ టీంకి మళ్లీ జాయిన్ కావడం విశేషం. ఈ రోజు (ఏప్రిల్ 24న) ఈ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది.

Also Read :  Kishkindhapuri : బెల్లంకొండ హర్రర్ మ్యాజిక్.. 'కిష్కింధపురి' గ్లింప్స్ అదుర్స్

Also Read : Koragajja : ‘కాంతార’ కంటే భిన్నంగా తులునాడు దేవతా గాథ ‘కొరగజ్జ’

ఈ ప్రాజెక్ట్‌ను అత్యున్నత నిర్మాణ విలువలతో, భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. గోపీచంద్ యాక్షన్ పర్ఫార్మెన్స్, ఆసక్తికరమైన కథనం, హై టెక్నికల్ స్టాండర్డ్స్‌ కలగలిపి ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద మరో సెన్సేషన్‌గా నిలిపేలా చూస్తున్నాయి. మలయాళ నటి మీనాక్షి దినేష్ కథానాయికగా నటించనుండగా.. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాపినీడు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. నటీనటులు మరియు సాంకేతిక సిబ్బంది వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.