SDGM : బాలీవుడ్ హీరోతో టాలీవుడ్ డైరెక్టర్ మూవీ !

Kalki 2898 AD : ‘కల్కి 2898 AD’ లో భాగం అవ్వడం గ్రేట్ హానర్ : అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని జతకట్టారు. వీరిద్దరి కాంబోలో వస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్​ ను టాలీవుడ్ అగ్ర నిర్మాణసంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నేడు హైద‌రాబాద్ లో పూజా కార్య‌క్ర‌మాల‌తో సినిమా లాంచ‌నంగా ప్రారంభమైంది. జూన్ 22 నుంచి ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకానుంది. ‘#SDGM’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘మాస్ ఫీస్ట్ లోడింగ్’ అనేది క్యాప్షన్. ఈ సినిమాతో గోపీచంద్ మలినేని బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Kalki 2898 AD : గ్రేటెస్ట్ లెజెండ్స్ తో వర్క్ చేయడం.. ఇట్స్ బిగ్గర్ దెన్ డ్రీం : ప్రభాస్

ఇకపోతే క్రాక్ మరియు వీరసింహా రెడ్డి వంటి రెండు వరుస బ్లాక్‌బస్టర్‌లను అందుకున్న గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించనున్నారు. మరోవైపు గతేడాది రిలీజైన ‘గ‌ద‌ర్ 2’ తో సన్నీ డియోల్ భారీ హిట్ అందుకున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి. ఇక రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తుండ‌గా, రిషి పంజాబీ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. న‌వీన్ నూలి ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.